సర్కార్ సీజన్ 3 నెక్స్ట్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి "కలర్ ఫోటో" టీమ్ ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ సందీప్, హీరో సుహాస్, హీరోయిన్ చాందిని చౌదరి, సపోర్టింగ్ ఆర్టిస్ట్ దివ్య శ్రీపాద వచ్చారు. "అందరూ సిద్ధంగా ఉన్నారు కదా..ఇక మొదలు పెడదామా" అని ప్రదీప్ అడిగేసరికి "వన్ సెకండ్" అన్నారు సందీప్ రాజ్. "ఇది ఆ షో కాదు కదా" అన్నాడు ప్రదీప్ ఫన్నీగా.."ఎప్పుడూ మీరే మమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు కాబట్టి ఇప్పుడు మేము మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాం అని చెప్పారు సందీప్.."వావ్ ప్రాసెస్ ఏంటి సర్...ఫస్ట్ క్వశ్చన్స్ మీరు అడుగుతారా ఆన్సర్స్ నేను చెప్పాలా" అనడంతో అందరూ నవ్వేశారు.."ఫస్ట్ క్వశ్చన్..ముళ్ళు దేనికి ఉంటాయి" అని సందీప్ అడగడంతో "ముళ్ళు మొక్కలకు ఉంటాయి" అని ఆన్సర్ చెప్పాడు ప్రదీప్ "రాంగ్ ఆన్సర్...గడియారానికి ముళ్ళు ఉంటాయి" అని చెప్పారు సందీప్..
తర్వాత "క్యాప్ దేనికి పెడతారండి" అని సుహాస్ ప్రదీప్ ని అడిగారు. "క్యాప్ దేనికి పెడతారు తలకు పెడతారు" అని చెప్పాడు ప్రదీప్ "కాదన్నా పెన్నుకి క్యాప్ పెడతారు" అని ఆన్సర్ చెప్పారు సుహాస్. ఇదంతా ఐపోయాక గేమ్ లోని ప్రశ్నలు అడిగాడు "ఈ సినిమాలో హీరో విశాల్ గారు" అని ప్రదీప్ చెప్పేసరికి "వన్ లాఖ్ చెప్పు అని సుహాస్ సందీప్ తో, నువ్వు వన్ లాఖ్ టెన్ థౌసండ్ అని చెప్పు దివ్య" అనేసరికి "ఏంటి భయ్యా ఏం చేస్తున్నావ్" అని ప్రదీప్ అడిగాడు. "ఒకేసారి పంపించేస్తే మనం ఆడుకోవచ్చని" చెప్పారు సుహాస్. "నాకు ఇంత హెల్ప్ చేయడానికి వచ్చావా నువ్వు" అని నవ్వుతూ అడిగాడు ప్రదీప్. ఫైనల్ గా చాందిని చౌదరి, సుహాస్ ఇద్దరూ స్టేజి మీద కలర్ ఫోటోలోని ఒక సీన్ ని చేసి చూపించారు. ఇలా ఈ షో ప్రోమో ఎండ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ జూన్ 2 వ తేదీ రాత్రి 8 గంటలకు ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది.